హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబరిమల యాత్ర విజయవంతం.. స్వాములకు ఘన స్వాగతం!

SRD: 35 రోజుల పాటు కాలినడకన అయ్యప్ప సన్నిధికి సాగిన భక్తుల యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి, కోనాపూర్ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు కేరళలోని శబరిమల చేరుకుని క్షేమంగా తిరిగి రావడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామి అనుగ్రహంతో యాత్ర సాఫీగా సాగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.