హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో వేళ.. కూరగాయల సాగుతో రైతులకు లాభాలు!

JGL: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల రైతులు తక్కువ నీటితో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. గ్రామంలోని రైతులు 150 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. మెట్‌పల్లి, కోరుట్ల మార్కెట్లలో విక్రయిస్తూ రోజుకు రూ.2 వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో సాగు లాభదాయకంగా మారింది.