హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

SRCL ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎల్లారెడ్డిపేట పోలీసులు శుక్రవారం సాయంత్రం నారాయణపూర్ శివారులో పట్టుకున్నారు. డ్రైవర్ బోదాసు అరవింద్‌‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్‌తో సహా స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.