హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు అభివృద్ధిపై చర్చకు సిద్ధం: గంపల శివ

MLG: మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నేత భూక్య జంపన్న చేసిన విమర్శలను ఏటూరునాగారం మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంపల శివ ఖండించారు. ములుగు అభివృద్ధిపై మాట్లాడే ముందు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన హామీలు, అభివృద్ధి పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని, వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు.