హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో అబార్షన్ కిట్ల అమ్మకాలపై తనిఖీలు

HYDలో మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్ల విక్రయాలపై TG SAFE అధికారులు నిఘా పెట్టారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్‌‌కు ఉపయోగించే మందుల వల్ల మహిళల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ తనిఖీలు చేపడుతున్నారు. మందులు విక్రయాలకు సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నారు.