KNR: హుజూరాబాద్ పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. గత ఐదు రోజుల్లో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆదర్శనగర్‌లోని రెండు ఇళ్లలో 100 గ్రాముల బంగారం, 41 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదును అపహరించారు. తాజాగా బండ అంకుస్వాడలో సింగిరెడ్డి విజయ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.50 వేల నగదు, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు.
తెలంగాణ
హుజూరాబాద్‌లో వరుస చోరీలు..ప్రజల్లో ఆందోళన


