హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తాగుతున్న ఐదుగురు యువకుల అరెస్టు

HNK: కమలాపూర్ మండలం వంగపల్లి శివారు వంతెన సమీపంలో గంజాయి తాగుతున్న ఐదుగురు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 59 గ్రాముల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నవీన్ తెలిపారు. నిందితుల్లో నలుగురు కరీంనగర్ జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు కమలాపూర్ మండలం గుండేడు వాసిగా గుర్తించారు.