KNR: నగరపాలక సంస్థ కార్యాలయంలో నలుగురు గ్రూప్-1 ట్రైనీ డీఎస్పీలు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నగర పాలన, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల పనితీరును ఆయన వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, ఆక్రమణల తొలగింపులో పోలీసు, బల్దియా శాఖల సమన్వయం ప్రాధాన్యతను తెలియజేశారు.
తెలంగాణ
బల్దియా విధులపై ట్రైనీ డీఎస్పీలకు అవగాహన


