JGL: మహిళా స్వయం సహాయక సంఘాల లెక్కల్లో పారదర్శకత కోసం ప్రతి సంఘానికి లేదా ప్రతి రెండు సంఘాలకు ఒక బుక్ కీపర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో 16,273 సంఘాల్లో 1,82,261 మంది సభ్యులు, 565 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. ఎంపికైన బుక్ కీపర్లకు త్వరలో శిక్షణ ఇస్తామని, సంఘాలు నెలకు రూ.150 నుంచి రూ.300 వరకు చెల్లించవచ్చని డీఆర్‌డీవో రఘువరణ్ తెలిపారు.
తెలంగాణ
స్వయం సహాయక సంఘాలకు బుక్ కీపర్లు


