హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ ప్రవేశ పరీక్షకు 3,888 మంది విద్యార్థులు

KNR: జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 3,888 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 10:45 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.