హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పోటీల్లో పోలీసు అధికారుల ప్రతిభ

KNR: గుజరాత్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో తెలంగాణ పోలీసు అధికారులు సత్తా చాటారు. మహిళల 50 ఏళ్ల పైబడిన డబుల్స్ విభాగంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి, సీఐడీ డబ్ల్యూఏఎస్ఐ కె. పద్మ ద్వయం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేతలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించి, విధులతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు.