హైదరాబాద్: 28°C
తెలంగాణ

150 మందికి డయాబెటిస్ పరీక్షలు

PDPL: ధర్మారం మండలం గోపాల్‌రావుపేటలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 150 మందికి డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 8 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు ఛైర్మన్ చింతపండు నరసింగం తెలిపారు. వ్యాధిగ్రస్తులకు తీసుకోవలసిన ఆహారం, ఇతర జాగ్రత్తలపై డా.కుమార్, డా. మల్లేష్ అవగాహన కల్పించారు. ఇందులో సర్పంచ్ సౌజన్య, ప్రధాన కార్యదర్శి రమేష్, సభ్యులు పాల్గొన్నారు.