హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ భర్తపై కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు

MNCL: వేమనపల్లి మండలం సుంపుటం సర్పంచ్ భర్త దుర్గం తిరుపతి దాడి చేసి, హత్య చేస్తానని బెదిరించినట్లు కార్యదర్శి వెంకటయ్య నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ బిల్లుల చెల్లింపు విషయంలో వివాదం జరిగి మండల పంచాయతీ అధికారి సమక్షంలోనే తనపై దాడి చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి సర్పంచ్ భర్తను అరెస్ట్ చేయాలన్నారు.