మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి రామకృష్ణాపూర్ వెళ్లే మార్గంలో గద్దెరాగడి వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఆర్. వెంకటేష్ అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముఖం, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది దుర్గప్రసాద్, పైలట్ కొమురయ్య ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు


