హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్‌ ప్రూఫ్‌ పాస్ పుస్తకాలిస్తాం: పొంగులేటి

TG: రాష్ట్రంలో భూముల రీసర్వే పూర్తైన తర్వాత వాటర్ ఫ్రూఫ్‌, చిరిగిపోని విధంగా ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పుస్తకంపై QR కోడ్ ముద్రిస్తామని.. దాన్ని స్కాన్ చేయగానే భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ఇతర వివరాలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూముల రీసర్వే దేశానికే ఆదర్శమన్నారు.