హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవసరమైన ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, మిల్లర్లు దిగుమతిలో జాప్యం చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. అధికారులు కొనుగోలు ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు.