హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో ప్రవళికకు స్వర్ణం

NLG: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన బిమ్స్‌టెక్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల 400 మీటర్ల రిలే జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ జట్టులో దేవరకొండ నియోజకవర్గం డిండి గ్రామానికి చెందిన నారిమల్ల ప్రవళిక చోటు దక్కించుకుని ప్రతిభ చాటింది. ఆమె విజయంపై గ్రామస్థులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.