ASF: పెంచికల్ పేట్ మండలం అటవీ రేంజ్ పరిధిలో బొజ్జ చెట్లను అక్రమంగా నరికి లక్కను తరలిస్తున్న 4 ముఠాలపై అటవీశాఖ ఉక్కుపాదం మోపింది. 25 రోజులుగా ప్రత్యేక గస్తీతో మురళీగూడ, కమ్మర్గావ్, నందిగామ, అగరూడలో 4 కేసులు నమోదు చేశారు. 8 మందిపై కేసులు నమోదు చేశారు. లక్కను ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
తెలంగాణ
అక్రమంగా లక్క తరలిస్తున్న వారిపై కేసులు


