WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులను రూ. 50 లక్షలకు పెంచాలని BJP మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు ఆవుల నారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అలాగే సర్వే నంబర్ 721లోని ప్రభుత్వ భూమికి ప్రహరీ నిర్మించి ఆక్రమణలు అరికట్టాలని కోరారు.
తెలంగాణ
'పంచాయతీ భవనానికి నిధులు కేటాయించాలి'


