హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి కాలభైరవ స్వామి జన్మదినోత్సవాలు

KMR:రామారెడ్డి-ఇసనపల్లిలోని కాలభైరవ స్వామి ఆలయంలో నేటి నుంచి డిసెంబర్ 2 వరకు స్వామివారి జన్మదినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ ప్రభు తెలిపారు.