హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

AP: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మార్కాపురం, ప్రకాశం, మిగతా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.