హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు

ASF: జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.