GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో 2027 సంవత్సరానికి నిర్వహించిన బహిరంగ వేలంలో పలు హక్కులు ఖరారయ్యాయి. రక్ష కంకణాల విక్రయ హక్కు రూ.51 లక్షలు, వాహన పార్కింగ్ రూ.28 లక్షలు, కొబ్బరి చిప్పల సేకరణ రూ.7.77 లక్షలు, తలనీలాల సేకరణ రూ.6.60 లక్షలకు దక్కాయి. కొబ్బరికాయల విక్రయ హక్కు వేలాన్ని డిసెంబర్ 7కు వాయిదా వేసినట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
బీచుపల్లి ఆలయ వేలం.. భారీ ధరలు


