SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవంలో భాగంగా శుక్రవారం 17వ రోజు వేడుకలను ఆలయ ఏఈవో జయకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం


