GDWL: అయిజ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సంక్షేమ పథకాల కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టిందని తెలిపారు. అర్హులైన మహిళలందరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, చేయూత పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మహిళల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం: కలెక్టర్


