హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోయిలకొండలో నేడు ఎమ్మెల్యే పర్యటన

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.