హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా 18వ రోజు గోదావరి హారతి

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 18వ రోజు గోదావరి హారతి నిర్వహించారు. శారదా, వాసవి మహిళా మండళ్లతో పాటు కరీంనగర్ తిరుమల సేవా గ్రూప్, పెద్దపల్లి శ్రీవల్లి సేవా గ్రూప్ సభ్యులు, అర్చకులు, భక్తులు ఆలయం నుంచి మేళతాళాలు, హరినామ సంకీర్తనలతో గోదావరి వరకు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలు సమర్పించారు.