హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు స్ప్రింక్లర్ల పంపిణీ

నాగర్ కర్నూలు: కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో 13 మంది రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ ఛైర్మన్ దామోదర్ గౌడ్, మాజీ సర్పంచి రాకేష్ కుమార్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. నీటి పొదుపుతో పంటల సాగుకు స్ప్రింక్లర్లు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా రైతులకు సూచించారు.