హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు రోడ్డు భద్రతపై అవగాహన

నాగర్ కర్నూలు: జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆదేశాల మేరకు అచ్చంపేటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలు, పరిణామాలపై విద్యార్థినులకు వివరించారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, విద్యపై శ్రద్ధ చూపాలని జిల్లా షీ టీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్సై ఇందిర సూచించారు.