హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

KMR: గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బూర్గుల్‌కు చెందిన ప్రశాంత్ బైకుపై గాంధారికి వెళ్తుండగా పెద్దవాగు బ్రిడ్జిపై లారీ ఢీకొంది. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు