హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూళ్ల దగ్గర జంక్ ఫుడ్ అమ్మితే చర్యలు!

స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ విక్రయాలు, ప్రకటనలపై మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే నిషేధం విధించింది. అలాగే ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అక్కడి FDA అధికారులు చర్యలకు దిగారు. 2026 APR- 1 నుంచి NOV-19 వరకు 422 స్కూళ్లలో తనిఖీలు చేసి, 79 జంక్ ఫుడ్ స్టాల్స్‌ను సీజ్ చేశారు. మరో 21 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. పిల్లలకు హానికరమైన ఆహారం అందకుండా ఈ చర్యలు చేపట్టారు.