హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లుకు జనసేన సంపూర్ణ మద్దతు

AP: కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్-2026 బిల్లుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసే సంస్కరణలను NDA ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు 2051 వరకు ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలన్న ప్రతిపాదన అభినందనీయమని పవన్ అన్నారు.