AP: తమకు బలం ఉందని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని TDP నేతలకు మంత్రి లోకేష్ సూచించారు. చిన్న ఎన్నికలైనా, పెద్ద ఎన్నికలైనా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. బలహీనంగా ఉన్న చోట గెలవాలని, బలంగా ఉన్న చోట మెజార్టీని మరింత పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. 2024లో మొదలైన కూటమి విజయ పరంపర పంచాయతీ ఎన్నికల వరకూ కొనసాగుతోందని.. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు.
వార్తలు
ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి: లోకేష్


