హైదరాబాద్: 28°C
వార్తలు

TDP, YCP శ్రేణుల మధ్య ఘర్షణ

AP: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం మురడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. TDP, YCP శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. తమ కార్యకర్తలపై YCP నేతలు దాడికి పాల్పడినట్లు TDP నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు.