TG: భావితరాలకు ఆరోగ్యం, విజ్ఞానం అందించాలంటే మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని దర్శకుడు బోయపాటి శ్రీను సూచించారు. కుటుంబ బంధాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. డ్రగ్స్ రహిత దేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన HYD వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ ముగింపు వేడుకలో శ్రీను పాల్గొన్నారు.
వార్తలు
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: బోయపాటి


