TG: హైదరాబాద్ నగరం అంతా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంటలో 2 సెం.మీ. వర్షం పడితే నగరమంతా జలమయమవుతోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చేయనందువల్లే.. ఎల్‌నినో వంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఆహార కొరత సమస్య ఏమీ లేదని.. సరిపడా తిండిగింజలు ఉన్నాయని స్పష్టం చేశారు. నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందన్నారు.
వార్తలు
ఆహార కొరత సమస్య ఏమీ లేదు: రేవంత్


