హైదరాబాద్: 28°C
వార్తలు

'డీలిమిటేషన్ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం'

రాజ్యాంగాన్ని మార్చేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ, అమిత్ షా డీలిమిటేషన్‌తో ముడిపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ సీనియర్ ఎంపీల మధ్య చర్చలు జరిగాయని, శనివారం ఇతర పార్టీలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. రాష్ట్రాల వారీగా ఉన్న సీట్ల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అందులోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు.