SRD: మనూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పట్లోళ్ల పురుషోత్తం పాటిల్ శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం పులకుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి


