హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై పడిన ధాన్యం సంచులు

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పాత NH-7 ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలో వడ్ల లోడుతో వెళుతున్న లారీ నుంచి ధాన్యం బస్తాలు జారి కిందపడ్డాయి. రహదారి అధ్వాన్నంగా ఉండటంతో లారీ అదుపుతప్పి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో పక్క నుంచి వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.