హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పొగాకు రహిత సమాజానికి యువతే కీలకం'

PPM: పొగాకు రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు సూచించారు. టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా శుక్రవారం సీతానగరం మండలం మరిపివలస పాలిటెక్నిక్ కళాశాలలో వైద్య బృందంతో కలిసి ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.