హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి గర్వకారణం హేవలాక్ బ్రిడ్జి

E.G: రాజమండ్రిలో గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన ఎన్నో దశాబ్దాల పాటు రైళ్ల రాకపోకలకు సేవలందించింది. ప్రస్తుతం వినియోగంలో లేకున్నా చారిత్రక కట్టడంగా ఆకట్టుకుంటోంది. దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గోదావరి అందాలను తిలకించేందుకు పర్యాటకులకు మరో ఆకర్షణగా మారే అవకాశం ఉంది.