హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోట మోర్ షోరూంలో విజిలెన్స్ అధికారుల దాడులు

KKD: సామర్లకోట మోర్ షోరూంలో శుక్రవారం సాయంత్రం విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. దుకాణాల్లో మండల సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 806 కిలోల బియ్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.