హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిమ్ ట్రైనర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

RR: మహిళపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్ కేసులో గచ్చిబౌలికి చెందిన జిమ్ ట్రైనర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 2015 నుంచి రాంకీ టవర్స్‌లోని జిమ్‌లో మహిళను వేధిస్తూ, ఫొటోలతో బెదిరించినట్లు కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో 2017 ఫిబ్రవరి 15న రాయదుర్గం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు శిక్ష ఖరారు చేసింది.