హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 10 వినతులు

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 10 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్ తెలిపారు. వీటిలో అత్యధికంగా గాజువాక జోన్ నుంచి నాలుగు వినతులు వచ్చాయన్నారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని జోనల్ అధికారులను ఆదేశించారు.