హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో

కోనసీమ: అత్రేయపురం మండలంలోని వాడపల్లి, ర్యాలి, మెర్లపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఎంపీడీఓ పి.వి.ఆర్.కె. రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి కల్పించాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.