హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లా స్థాయి చెకుముకి పరీక్ష

NLG: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి చెకుముకి పరీక్ష రేపు నల్లగొండలో జరగనుంది. పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని జేవీవీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.