SDPT: కోహెడ పోలీస్ స్టేషన్‌ను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. పరేడ్, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, వాహనాలు, రికార్డులను తనిఖీ చేశారు. విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత పాటించాలని, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో 'సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమం ద్వారా సీసీటీవీ నిఘా పెంచాలన్నారు.
తెలంగాణ
కోహెడ పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ


