హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో మట్టి తవ్వకాలపై విచారణకు డిమాండ్

SRPT: జానపహాడు చెరువులో రైల్వే లైన్ నిర్మాణం పేరుతో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు రమావత్ నరి నాయక్, దర్గా ఉపసర్పంచ్ రాజు, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ శుక్రవారం తహశీల్దార్ వజీద్‌కు ఫిర్యాదు చేశారు. తవ్వకాల అనుమతులు, మట్టి తరలింపు వివరాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.