CTR: పుంగనూరులోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు మంచి స్పందన లభించింది. పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ దశల్లో అభ్యర్థుల ప్రతిభను పరిశీలించి 30 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ అన్నార్ తెలిపారు. ఈ జాబ్‌మేళా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్‌మేళాలో యువతకు కొలువులు


