హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత్రికేయుడు శ్రీనివాస్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: జడ్చర్లకు చెందిన సీనియర్ పాత్రికేయుడు తాంబూలం శ్రీనివాస్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.